భ‌ర్త‌పై ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన మ‌హిళ‌.. పెళ్లి పేరుతో సీఐ మోసం!

భ‌ర్త‌పై ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన మ‌హిళ‌.. పెళ్లి పేరుతో సీఐ మోసం!

ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. న్యాయం చేయాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారి, పెళ్లి (Marriage) పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) సీఐ రాజు నాయక్‌పై (CI Raju Nayak) శనివారం కేసు నమోదైంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. 2023వ సంవత్సరంలో ఖమ్మం నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజు నాయక్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ తన భర్త తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ న్యాయం చేయాలని కోరుతూ మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో ఫిర్యాదు కాపీలో ఉన్న సదరు మహిళ (Concerned Woman) ఫోన్ నెంబర్ (Phone Number) తీసుకున్న సీఐ రాజు నాయక్, ఆమెకు వరుసగా ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. “నీ భర్త వేధింపుల నుంచి నిన్ను కాపాడి, నీకు పూర్తి న్యాయం చేస్తాను” అంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉంటూ.. నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోంగతీసుకున్నాడు.

గత కొంతకాలంగా సదరు మహిళ, సీఐ రాజు నాయక్ మధ్య ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే, బాధితురాలు పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ సీఐ రాజు నాయక్ ఏదో ఒక సాకుతో దాటవేస్తూ రాసాగాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. నేరుగా పోలీస్ ఉన్నతాధికారులను కలిసి తన ఆవేదనను వివరించింది. సీఐ రాజు నాయక్ తనను పెళ్లి పేరుతో నమ్మించి ఎలా మోసం (Cheated) చేశాడో ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ రాజు నాయక్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న సీఐ రాజు నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment