దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన వీధి కుక్కల (Street Dogs) దాడుల వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. రోడ్లపై(Roads) తిరిగే వీధి కుక్కలను నియంత్రించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చబోమని స్పష్టం చేసిన ధర్మాసనం.. 2025లో జారీ చేసిన ఉత్తర్వులే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. జస్టిస్ (Justice) విక్రమ్‌నాథ్ (Vikram Nath), జస్టిస్ సందీప్ మెహతా (Sandeep Mehta), జస్టిస్ ఎన్వీ అంజారియాలతో (NV Anjaria) కూడిన బెంచ్ ఈ కేసులో విచారణ జరిపి, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ (Animal Welfare Board) దాఖలు చేసిన పిటిషన్లను కూడా కొట్టివేసింది. ప్రజల ప్రాణ భద్రత, ప్రజారోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇప్పటికే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హోమ్‌లకు తరలించాలని, వాటికి నసర్గీకరణ, టీకాలు (Vaccination) వేసిన తర్వాత మళ్లీ రోడ్లపైకి వదలకూడదని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం దేశంలోని పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆట స్థలాల వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని అన్ని రాష్ట్రాలు, నేషనల్ హైవే అథారిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుక్కల దాడులు, రేబీస్ కేసుల (Rabies Cases) నేపథ్యంలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రజల భద్రత కోసం కఠిన చర్యలు అవసరమని పలువురు వాదించగా, మరోవైపు జంతు హక్కుల కార్యకర్తలు మూగజీవాలపై క్రూరత్వం ప్రదర్శించకూడదని అభిప్రాయపడ్డారు. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు.. భవిష్యత్తులో వీధి కుక్కల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకంగా మారనుందని భావిస్తున్నారు.









అన్నపై పరోక్ష కౌంటరా?.. మనోజ్ వ్యాఖ్యలపై చర్చ