సీఎం అయినా ‘జననాయగన్’కు క్లియర్ కాలేని అడ్డంకులు..

సీఎం అయినా ‘జననాయగన్’కు క్లియర్ కాలేని అడ్డంకులు..

విజయ్(Vijay) తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’(Jananayagan) విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎం(CM) అయ్యాక సినిమా విడుదలకు (Release) ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అభిమానులు భావించినప్పటికీ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాకు సెన్సార్ బోర్డు (Censor Board) నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సినిమా విడుదల మళ్లీ వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. మొదట బక్రీద్ కానుకగా మే నెలాఖరులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు జూన్ 19 తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. విజయ్ పుట్టినరోజు జూన్ 22కు ముందే సినిమాను విడుదల చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తోంది.

అయితే ఈ ప్లాన్ కార్యరూపం దాల్చాలంటే ముందుగా సెన్సార్ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాలోని కొన్ని కీలక రాజకీయ సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2026 ప్రారంభం నుంచి పలుమార్లు రివైజింగ్ కమిటీ (Revising Committee) ముందుకు వెళ్లినప్పటికీ ఇంకా క్లియరెన్స్ రాకపోవడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఆలస్యంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పై భారీ ఆర్థిక భారం పడుతోంది. థియేట్రికల్ డీల్స్‌తో పాటు ఓటీటీ(OTT) ఒప్పందాలు కూడా హోల్డ్‌లో పడిపోవడంతో ప్రతి వారం ఆలస్యం నిర్మాతలకు అదనపు ఖర్చులను మోపుతోంది. దీంతో ‘జననాయగన్’ రిలీజ్ ఎప్పుడు అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment