ఏపీ ఆర్థిక వ్యవస్థ క్రాష్.. అంతా అబద్ధాల ప్రచారం – ఆధారాలతో జగన్ ట్వీట్

ఏపీ ఆర్థిక వ్యవస్థ క్రాష్.. అంతా అబద్ధాల ప్రచారం - ఆధారాలతో జగన్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితి పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిందని, కూటమి ప్రభుత్వ(Coalition Government) తప్పుడు విధానాలు(Wrong Policies), అవినీతి (Corruption) వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (State Economy) దెబ్బతిన్నదంటూ వైసీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ చేస్తూ, చంద్రబాబు ప్రభుత్వంపై (Nara Chandrababu Naidu Government) గణాంకాలతో సహా విరుచుకుపడ్డారు.

రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తోన్న ప్రచారం కేవలం అబద్ధాల వలయమని, ప్రజల దృష్టిని మళ్లించడానికే “అభివృద్ధి(Development), సంపద సృష్టి(Wealth Creation)” అనే కలరింగ్ ఇస్తున్నారని జగన్ మండిపడ్డారు.

కాగ్ నివేదికలు ఏం చెబుతున్నాయి..?
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలను(Reports) ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీ (GSDP) వృద్ధి రేటు ఏకంగా 10.75 శాతం నమోదైందని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.

“నిజంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అక్కడ పెట్టుబడులు, వినియోగం పెరగాలి. తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను వసూళ్లు కూడా భారీగా పెరగాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు (Own Tax Revenues) ఏకంగా 3.22 శాతం తగ్గిపోయాయి. పన్ను ఆదాయం తగ్గడమే చంద్రబాబు చెప్పే సంపద సృష్టినా?” అని జగన్ ప్రశ్నించారు.

రూ. 1 లక్ష కోట్లు దాటాల్సింది.. రూ. 86 వేల కోట్లకే పరిమితం!
వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలుస్తూ జగన్ స్పష్టమైన లెక్కలను బయటపెట్టారు. మా ప్రభుత్వ చివరి సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 85,922.23 కోట్లు. ఆ తర్వాత ఈ రెండేళ్లలో కనీసం 8 శాతం సాధారణ వృద్ధి రేటు (Normal Growth) నమోదై ఉన్నా.. ఈ ఏడాదికి పన్నుల ఆదాయం రూ. 1,00,219.69 కోట్లకు చేరాలి. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమే.

అంటే కనీస వృద్ధి కూడా లేకపోగా, గతేడాది ఏపీఎండీసీ (APMDC) ద్వారా సమీకరించిన రూ. 9 వేల కోట్ల నిధులతో కూడా ఎలాంటి సంపద సృష్టి జరగలేదని జగన్ విమర్శించారు. గతేడాది ఆదాయాలు తగ్గితే కనీసం ఈ ఏడాదైనా పెంచుకోవాలన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదన్నారు.

మద్యం ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి?
కూటమి ప్రభుత్వ విధానాలు, అవినీతి చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగమనంలోకి (Slowdown) వెళ్లిపోయిందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో జీఎస్‌టీ (GST), సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు కనీసం 5 శాతం కూడా పెరగలేదని, పైగా సేల్స్ ట్యాక్స్ రెండేళ్ల కిందటి కంటే ఇంకా తగ్గిపోయిందని చెప్పారు.

ముఖ్యంగా ఎక్సైజ్ (మద్యం) (Excise – Liquor Revenue) ఆదాయం ఏకంగా 8.20 శాతం తగ్గడంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటీకరించిందని, విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఇంతలా మద్యం విక్రయాలు పెరిగినా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పెరగకపోగా తగ్గడానికి కారణం.. పాలకుల అవినీతి, అక్రమాలేనని ఆయన దుయ్యబట్టారు.

మొత్తం మీద రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు 3.22 శాతం ప్రతికూల వృద్ధిని (Negative Growth) నమోదు చేయడం రాష్ట్ర భవిష్యత్తుకు గండసూచికని, కేవలం అంకెలను కాగితాల మీద సృష్టించి ప్రజలను చంద్రబాబు సర్కార్ మోసం చేస్తోందని వైఎస్ జగన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment