ఉత్తరాంధ్ర యాసలో జాన్వీ డైలాగ్స్.. ఫ్యాన్స్ ఫిదా!

ఉత్తరాంధ్ర యాసలో జాన్వీ డైలాగ్స్.. ఫ్యాన్స్ ఫిదా!

Summarize with AI

పెద్ది (Peddi) సినిమాపై రోజురోజుకు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌లో ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి, ఒక రోజు ముందుగానే ఓవర్సీస్ సహా పలు ప్రాంతాల్లో భారీ ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక మే 18 నుంచి ‘పవర్‌ప్లే టూర్’ (Powerplay Tour) పేరుతో దేశవ్యాప్తంగా గ్రాండ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతుండగా, ముంబైలో జరిగే మెగా ఈవెంట్‌లోనే సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీకపూర్ (Janhvi Kapoor) గురించి వచ్చిన తాజా అప్‌డేట్ అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తోంది. ఈ చిత్రంలో తన పాత్రకు జాన్వీ స్వయంగా తెలుగులోనే డబ్బింగ్ చెబుతుండటం విశేషంగా మారింది. ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ పలకడం అంత ఈజీ కాకపోయినా, పాత్రలో సహజత్వం కోసం ఆమె ప్రత్యేకంగా శ్రమిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కెరీర్‌లో తొలిసారి తెలుగులో సొంత వాయిస్ ఇవ్వనున్న జాన్వీ డెడికేషన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment