త్రిష ఒక్క రియాక్షన్‌తో సోషల్ మీడియాలో భారీ చర్చ

త్రిష ఒక్క రియాక్షన్‌తో సోషల్ మీడియాలో భారీ చర్చ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా భావిస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా విడుదలైన ‘కరుప్పు’(Karuppu) సినిమా ప్రీమియర్ షోకు హాజరైన త్రిషను అభిమానులు భారీగా చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ఓ అభిమాని “సీఎం విజయ్‌ను నేను అడిగానని చెప్పండి” అంటూ సరదాగా మాట్లాడగా, త్రిష నవ్వుతూ సిగ్గుపడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి అభిమానులు ఫిదా అవుతుండగా, మరోవైపు నెటిజన్లు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. గత కొంతకాలంగా విజయ్-త్రిషల (Vijay-Trisha) సాన్నిహిత్యం గురించి తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.

ఇక ‘కరుప్పు’ సినిమా విడుదల కూడా కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. హీరో సూర్య ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆర్‌జే బాలాజీ (RJ Balaji) తెరకెక్కించిన ఈ చిత్రం మొదట రిలీజ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరకు మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెన్నైలో జరిగిన ప్రీమియర్ షోకు హీరో కార్తీ, త్రిష, దర్శకుడు ఆర్‌జే బాలాజీ హాజరై అభిమానుల్లో జోష్ నింపారు. థియేటర్ వద్ద అభిమానుల సందడి మధ్య త్రిష దర్శకుడిని హగ్ చేసుకుని అభినందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment