పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. గడువు కావాల‌ని విజ్ఞ‌ప్తి

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. రెండు రోజుల గడువు కావాల‌ని విజ్ఞ‌ప్తి

కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) కొడుకు బండి భ‌గీర‌థ్ (Bandi Bhageerath) వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ కేసులో జ‌రుగుతున్న జాప్యం అటు బీజేపీని(BJP), ఇటు తెలంగాణ‌లోని (Telangana) అధికార కాంగ్రెస్ పార్టీపై (Congress Party) ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్థితుల్లో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు (Pet Basheerabad Police) లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. పోలీసుల నుంచి తనకు నోటీసులు అందినట్లు ధృవీకరించిన ఆయన, దర్యాప్తునకు హాజ‌ర‌య్యేందుకు త‌న‌కు స‌మ‌యం కావాల‌ని కోర‌డంతో తెలంగాణ స‌మాజం మండిప‌డుతోంది.

విచారణకు హాజరు కావాలని పోలీసులు పంపిన నోటీసులో ఇచ్చిన సమయం చాలా తక్కువగా ఉందని భగీరథ్ పేర్కొన్నారు. 13-05-2026 (బుధవారం) నాడే విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. విచారణకు అవసరమైన సమాచారం, కీలక పత్రాలు, డాక్యుమెంట్లను (Documents) సేకరించడానికి తనకు మరో రెండు రోజుల సమయం కావాలని పోలీసులను కోరారు.

ప్రస్తుతం నెలకొన్న కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల కారణంగానే తాను వెంటనే హాజరు కాలేకపోతున్నానని ఆయన వివరించారు.తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువని ఆయన లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని, అందుకు తనకు కొంత సమయం కేటాయించాలని పోలీసు అధికారులను విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment