ఐపీఎల్ 2026లో(IPL 2026) ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB) థ్రిల్లింగ్ విక్టరీ సాధించినా.. కెప్టెన్ రాజత్ పటీదార్ (Rajat Patidar) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 39 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కృనాల్ పాండ్య(Krunal Pandya) ఒత్తిడిలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 46 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఆర్సీబీ నర్వ్స్‌ను కంట్రోల్ చేసి విజయం అందుకుంది. మరోవైపు భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) 4 వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి ప్లేఆఫ్స్ రేసులో మరింత బలంగా నిలిచింది.
అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాజత్ పటీదార్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. “మాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. 166 పరుగుల లక్ష్యాన్ని మరింత సులభంగా చేధించాల్సింది. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో మేం గెలవడానికి అర్హులు కాదనిపించింది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కృనాల్ పాండ్య అనుభవమే జట్టును ఒత్తిడిలో నుంచి బయటపడేసిందని ప్రశంసించిన పటీదార్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌ను కూడా ప్రత్యేకంగా కొనియాడాడు. మ్యాచ్ గెలిచినా పూర్తి సంతృప్తి లేదని చెప్పిన ఆర్సీబీ కెప్టెన్ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.








‘సిట్’ వేయడమంటే కేసును నీరుగార్చడమే.. – హరీష్‌రావు