CA ఫలితాలు.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు

CA ఫలితాలు విడుద‌ల‌.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు

చార్టెడ్ అకౌంటెంట్స్ (CA) తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారికంగా ఫ‌లితాలు విడుద‌ల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన‌ అభ్యర్థులు స‌త్తాచాటారు.

హైదరాబాద్‌కి చెందిన హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ ఇద్దరూ సంయుక్తంగా 508 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సీఏ గ్రూప్-1 ఎగ్జామ్స్ ఈ ఏడాది నవంబర్ 3, 5, 7వ తేదీల్లో జ‌రిగాయి. ఇక గ్రూప్ 2కు నవంబర్ 9, 11, 13, 14 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు ప్రతి విభాగంలో 40 శాతం, మొత్తంగా 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://icai.nic.in/caresult/ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ వంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని ఐసీఏఐ తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment