బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పీఏ దారుణ హత్య

బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పీఏ దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా సంచలన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు సువేందు అధికారి (Suvendu Adhikari) పీఏ (PA) చంద్రనాథ్‌ను (Chandranath) మధ్యమ్గ్రామ్ ప్రాంతంలో దుండగులు కాల్చి హత్య చేసినట్లు సమాచారం. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చంద్రనాథ్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలు కాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని సువేందు అధికారి స్వయంగా పరిశీలించారు.
ఈ హత్యపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈ ఘటనను ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పేర్కొంది. దోషులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే CBI విచారణ జరపాలని డిమాండ్ చేసింది. మరోవైపు సువేందు అధికారి ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని ఆరోపిస్తూ, తన పీఏ హత్య వెనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడి (Nephew) హస్తం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment