ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ (Governor) జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ (Justice S. Abdul Nazeer) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం ఉదయం కడుపునొప్పితో ఆయన తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో (Manipal Hospital) చేరారు. వైద్యులు ఆయనకు అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి విజయవాడలోని లోక్‌భవన్‌కు (Lok Bhavan) చేరుకున్నారు.
గవర్నర్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), లోక్‌భవన్‌కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు