‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ జోడీ రిటర్న్స్… ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ జోడీ రిటర్న్స్… ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Summarize with AI

టాలీవుడ్‌లో కొన్ని జోడీలు కాలానికతీతంగా గుర్తుండిపోతాయి. అలాంటి ప్రత్యేక కాంబినేషన్‌లో సిద్ధార్థ్–త్రిష (Siddharth-Trisha) జంట ఒకటి. 2005లో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (‘Nuvvostanante Nenoddantana’)తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ జంట, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారని, ‘భర్తగా మారకు బ్యాచిలరూ…’ అనే వినూత్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇది రిలేషన్‌షిప్ నేపథ్యంతో కూడిన రొమాంటిక్ కామెడీగా రూపొందనుందని టాక్.

ఈ చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత దాంపత్య జీవితంలో జరిగే సరదా సంఘటనల చుట్టూ కథ నడవనుండగా, సిద్ధార్థ్–త్రిషలతో పాటు మరో యువ జంట కూడా కీలక పాత్రల్లో కనిపించనుంది. ‘బొమ్మరిల్లు’లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన దిల్ రాజు, ఈ సారి కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. విదేశాల్లో భారీ షెడ్యూల్‌తో షూటింగ్ నిర్వహించే ఆలోచనలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ‘విశ్వంభర’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న త్రిష, సిద్ధార్థ్‌తో మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment