ఓటీటీలోకి ప‌వ‌న్ సినిమా.. దక్కని స్పందన

ఓటీటీలోకి ప‌వ‌న్ సినిమా.. దక్కని స్పందన

సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ఓటీటీలోకి(OTT) వచ్చినప్పుడు నెటిజన్లు దాన్ని ఓ ఆట ఆడుకుంటారు. మీమ్స్, ట్రోల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో మెప్పించలేక ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో రిలీజైనప్పుడే పవన్ మేనరిజమ్స్, హరీష్ మార్క్ డైలాగ్స్‌పై ఓ రేంజ్ ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక ఆ ట్రోలింగ్ మరింత పెరుగుతుందని అందరూ ఊహించారు. కానీ విచిత్రంగా, ఈ సినిమాపై సోషల్ మీడియాలో కనీసం చర్చ కూడా జరగడం లేదు.

పవన్ ఫ్యాన్స్ అంతా మూకుమ్మడిగా ఈ సినిమా ఊసెత్తడం మానేశారు. అటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఓటీటీ ప్రపంచంలో ‘ఉస్తాద్’ హడావుడి అస్సలు కనిపించడం లేదు. స్ట్రీమింగ్‌కు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా ట్రెండ్ అవ్వకపోవడం గమనార్హం.

ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ గట్టిగానే కసరత్తు చేసింది. సినిమాపై క్రేజ్ పెంచేందుకు సరికొత్త ట్రైలర్ కట్ విడుదల చేయడమే కాకుండా, సినిమాలోని డైలాగ్స్‌ను మించేలా భారీ ప్రచారం చేసింది. సినిమా కంటెంట్ వీక్‌గా ఉండటంతో, నెట్‌ఫ్లిక్స్ చేసిన భారీ ప్రచారం కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారిందంటున్నారు సినీ ఫ్యాన్స్‌. మొత్తానికి థియేటర్లలో నిరాశపరిచిన ఉస్తాద్, ఓటీటీలో కూడా ‘సత్తా’ చాటలేకపోయాడన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment