సింహాచలం చందనోత్సవం.. టికెట్ల జారీపై భ‌క్తుల ఆందోళ‌న‌

సింహాచలం చందనోత్సవం.. టికెట్ల జారీపై భ‌క్తుల ఆందోళ‌న‌

విశాఖపట్నంలోని (Visakhapatnam) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో (Simhachalam) ఈ నెల 20న జరగనున్న చందనోత్సవం (Chandanotsavam) (అప్పన్న స్వామి నిజరూప దర్శనం) (Nijaroopa Darshanam) టికెట్ల విక్రయాల (Tickets Sales) చుట్టూ వివాదం ముసురుకుంది. సామాన్య భక్తులకు అందాల్సిన టికెట్లు అక్రమ మార్గాల్లో తరలిపోతున్నాయనే ఆరోపణలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం ఏడాదంతా వేచి చూసే సామాన్య భక్తులకు ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురవుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈనెల 20న జరిగే చందనోత్సవ టికెట్ల విక్రయంలో భారీస్థాయిలో గోల్ మాల్ జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కలెక్టరేట్ వేదికగా టికెట్ల దందా?
సాధారణంగా బ్యాంకుల ద్వారా, ఆన్‌లైన్ ద్వారా విక్రయించాల్సిన టికెట్లు, ఈసారి కలెక్టరేట్ సిబ్బంది కనుసన్నల్లో వీఐపీల సేవలో తరిస్తున్నాయని భక్తులు మండిపడుతున్నారు. కూటమి నేతల సిఫార్సు లేఖల ఆధారంగా కలెక్టరేట్‌లో గుట్టుచప్పుడు కాకుండా టికెట్ల విక్రయాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు(MLA) 50 నుండి 100 టికెట్ల వరకు అధికారులు కేటాయిస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రజాప్రతినిధుల పీఏలు (PAs) కలెక్టరేట్ వద్ద టికెట్ల కోసం బారులు తీరడం విమర్శలకు తావిస్తోంది.

సామాన్యుడికి తప్పని నిరీక్షణ
మరోవైపు, ఎండను కూడా లెక్కచేయకుండా బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన సామాన్య భక్తులకు మాత్రం ‘టికెట్లు లేవు’ అనే సమాధానం ఎదురవుతోంది. బ్యాంకులకు వెళ్లిన భక్తులకు స్టాక్ లేదని చెబుతుండగా, మరోపక్క సిఫార్సు లేఖలు ఉన్నవారికి మాత్రం టికెట్లు సులభంగా దక్కుతున్నాయి. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు వంటి నేతలు కేవలం ఇద్దరి కోసం సిఫార్సు లేఖలు ఇచ్చినా, ఇతర నేతల ఒత్తిడితో వందలాది టికెట్లు పక్కదారి పడుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం
“దేవుడి దర్శనంలో కూడా ఈ వివక్ష ఏంటి?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకుంటామని చెప్పిన అధికారులు, ఈసారి సామాన్య భక్తుల కంటే వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. చందనోత్సవం వంటి పవిత్రమైన ఘట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment