సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ప్రధాన నిందితుడిగా ఉన్న భారీ మోసం, మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) సహ నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ప్రభుత్వ సాక్షిగా మారి, తనకు తెలిసిన వివరాలన్నీ వెల్లడించేందుకు ఆమె సిద్ధమయ్యారు.
కోర్టులో ఏం జరిగింది?
శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా జాక్వెలిన్ తరపు న్యాయవాదులు తమ క్లయింట్ అప్రూవర్‌గా మారాలని అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, నేరుగా కోర్టులో అడగడం కంటే ముందుగా దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు అధికారికంగా విన్నవించుకోవాలని (Request) సూచించింది.
అసలు కేసు నేపథ్యం ఏమిటి?
బిలియనీర్ శివిందర్ సింగ్‌కు (Shivinder Singh) బెయిల్ ఇప్పిస్తానని చెప్పి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటించి ఆయన భార్య అదితి సింగ్ (Aditi Singh) నుండి సుకేశ్ చంద్రశేఖర్ రూ.215 కోట్లు వసూలు చేశారు. దర్యాప్తులో సుకేశ్ తన అక్రమ సంపాదనతో జాక్వెలిన్‌కు కోట్లాది రూపాయల విలువైన బహుమతులు (డైమండ్ ఇయర్ రింగ్స్, బ్రాండెడ్ బ్యాగులు, లగ్జరీ కార్లు) ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. సుకేశ్ నేర చరిత్ర తెలిసి కూడా ఆమె అతడితో సంబంధాన్ని కొనసాగించారని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
సుకేశ్ – జాక్వెలిన్ రిలేషన్
సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుండే జాక్వెలిన్‌కు ప్రేమలేఖలు రాయడం, గతంలో తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని ప్రకటించడం సంచలనం సృష్టించింది. అయితే, జాక్వెలిన్ తాను బాధితురాలినని, సుకేశ్ తనను తప్పుదోవ పట్టించాడని మొదటి నుండి వాదిస్తున్నారు. ఒకవేళ ఈడీ ఆమె అభ్యర్థనను అంగీకరిస్తే, జాక్వెలిన్ నిందితురాలి హోదా నుండి సాక్షి హోదాకు మారుతారు. ఇది సుకేశ్ చంద్రశేఖర్‌కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.








