2026లో స్టార్‌డమ్ వైపు దూసుకెళ్తున్న భాగ్యశ్రీ బొర్సే!

2026లో స్టార్‌డమ్ వైపు దూసుకెళ్తున్న భాగ్యశ్రీ బొర్సే!

Summarize with AI

2026లో భాగ్యశ్రీ బొర్సే (Bhagyashri Borse) కెరీర్‌కు కీలక మలుపు తీసుకువచ్చే సంవత్సరం‌గా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రం “లెనిన్” (Lenin) లో ఆమె భారతి అనే పాత్రలో కనిపించనుండటం పెద్ద హైలైట్‌గా మారింది. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్‌లో గట్టి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే 2025లో చేసిన కింగ్ డమ్ (Kingdom), కాంత, ఆంద్ర కింగ్ తాలుకా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు 2026లో స్టార్‌డమ్ దిశగా అడుగు పడే సంవత్సరం‌గా భావిస్తున్నారు.

ఇక మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ హీరోగా, వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్ట్‌లో కూడా భాగ్యశ్రీ పేరు హీరోయిన్‌గా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, కన్‌ఫర్మ్ అయితే ఆమెకు తమిళ ఇండస్ట్రీలో కూడా పెద్ద స్థాయి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 2026లో ఆమె కెరీర్ రెండు పెద్ద ఇండస్ట్రీల్లో సమాంతరంగా ఎదిగే అవకాశం ఉన్న సంవత్సరం‌గా ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ చర్చ నడుస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment