‘స్మార్ట్ లాక్‌డౌన్’.. రాత్రి 8 గంటలకే మాల్స్ బంద్

‘స్మార్ట్ లాక్‌డౌన్’.. రాత్రి 8 గంటలకే మాల్స్ బంద్

శ‌త్రుదేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పుల ఊబిలో ఉన్న దేశాన్ని గట్టెక్కించేందుకు, ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధిస్తూ పౌర సరఫరాలు మరియు వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది.

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పాక్ ప్రభుత్వం కింది సమయ పాలనను ఖరారు చేసింది. షాపింగ్ మాల్స్ ప్ర‌తిరోజూ రాత్రి 8 గంటలకే మూసివేయాలి. బేకరీలు, రెస్టారెంట్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లను రాత్రి 10 గంటలకే క్లోజ్ చేయాలని ఆదేశించింది. ఇతర వాణిజ్య సముదాయాలు అనవసరంగా విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని వ్యాపారస్తులకు సూచించింది. ఈ స్మార్ట్ లాక్‌డౌన్ నిబంధనలు దేశంలోని ప్రధాన ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు పంజాబ్, ఖైబర్ పంఖ్తుఖ్వా, బలూచిస్థాన్, రాజధాని ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో నేటి నుంచే అమలులోకి రానున్నాయి.

సంక్షోభానికి కారణాలు
ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు, దేశంలోని విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడం, పెరిగిన చమురు ధరల కారణంగా పాకిస్థాన్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించుకోకపోతే దేశం మరింత అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కూడా పాకిస్థాన్ ఇలాంటి పొదుపు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరింత విషమించడంతో ఈసారి ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment