“ఒక్క రాత్రిలోనే ఇరాన్ ముగింపు”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

“ఒక్క రాత్రిలోనే ఇరాన్ ముగింపు”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Summarize with AI

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయ వాతావరణాన్ని కుదిపేశారు. ఇరాన్‌ కు డెడ్‌లైన్ ముందు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ, “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా కొనసాగుతోంది” అని తెలిపారు. అవసరమైతే ఇరాన్‌ను ఒక్క రాత్రిలోనే పూర్తిగా ధ్వంసం చేసే శక్తి అమెరికాకు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అమెరికాను ఎదుర్కొనే దేశం లేదని, తమ సైనిక సామర్థ్యం ఇతర దేశాలకు అందని స్థాయిలో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనలు గ్లోబల్ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇక యుద్ధ పరిస్థితులపై మాట్లాడుతూ, శత్రు ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన F-15 యుద్ధ విమానం నుంచి పైలట్‌ను సురక్షితంగా రక్షించామని ట్రంప్ వెల్లడించారు. పైలట్‌ను కాపాడేందుకు 200 మంది సైనికులను పంపినట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ అమెరికా సైనిక దళాల సమన్వయం, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించిందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు అమెరికా దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయని, అవసరమైతే మరింత కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment