భారత్ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తాజాగా చూసిన ‘ధురందర్ 2’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని కోహ్లీ “జీవితంలోనే అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం”గా అభివర్ణించాడు. దాదాపు నాలుగు గంటల పాటు ఒక్క క్షణం కూడా కళ్లు తిప్పుకోలేకపోయానని, ప్రతి భావోద్వేగాన్ని ఈ సినిమా తనలో తట్టిలేపిందని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించాడు. ముఖ్యంగా కథానాయకుడు రణవీర్ సింగ్ నటనను కొనియాడుతూ, ఈ చిత్రంతో ఆయన కొత్త శిఖరాన్ని అధిరోహించారని ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ చేసిన ఈ రివ్యూ సినిమా చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచింది.
మరోవైపు ‘ధురందర్ 2’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డుల వేట కొనసాగిస్తోంది. విదేశాల్లో రూ. 394 కోట్లు, దేశీయంగా రూ. 1228 కోట్ల గ్రాస్ (రూ. 1041 కోట్ల నెట్) వసూళ్లు నమోదు కావడం చిత్ర విజయం ఎంత పెద్దదో చూపిస్తోంది. 18వ రోజుకీ కూడా దేశవ్యాప్తంగా వేలాది షోలతో రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. భారీ కలెక్షన్లు, స్టార్ ప్రశంసలతో ‘ధురందర్ 2’ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.








‘కమ్మని పాలనలో ఇబ్బందులు.. రాజీనామా చేస్తా’ – ఆదినారాయణరెడ్డి సంచలనం