కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

Summarize with AI

గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది పెద్ద తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ స్పష్టంగా చేశారు. పొత్తుతో పాటు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్‌ను నమ్మదగిన వ్యక్తి అని తాను ఎప్పుడూ భావించలేదని అజయ్ మాకెన్ చెప్పారు. కేజ్రీవాల్‌కు సైద్ధాంతికత లేదని, నిబద్ధత లేదని నేను తరచూ అభిప్రాయపడతానని వివ‌రించారు.

కరోనాతో ఢిల్లీ ప్రజలు చనిపోతున్న సమయంలో సీఎం కేజ్రీవాల్ శీష్ మహల్ నిర్మాణంలో బిజీగా ఉన్నారని మాకెన్ తీవ్రంగా విమర్శించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ తో కూడా బిజీగా ఉన్నదని ఆయన వివరించారు. ఢిల్లీలో 56,000 పైగా ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఖాళీగా ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు చేరడం లేదన్నారు. అలాగే, ఢిల్లీలో 14 ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం నానాటికి ఆలస్యం అవుతుంద‌ని, రూ. 10,250 కోట్ల అవసరం ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూ. 372 కోట్లు మాత్రమే కేటాయించబడినట్లు మాకెన్ వెల్లడించారు. ఢిల్లీని ఆప్ మరియు బీజేపీ కలిసి నడిపిస్తున్నప్పటికీ, రెండు పార్టీల పాలన కూడా విఫలమైందని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment