తన రాజధాని (Capital) ప్రణాళికలో భాగంగా, ప్లాన్-బీ (Plan-B) పేరిట జగన్ (Y. S. Jagan Mohan Reddy) చేసిన ప్రతిపాదన విస్తృత చర్చకు దారి తీసింది. తెలుగు పదాలకు దూరంగా ఈ మావిగన్ (MAVIGAN) (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అనే పేరు రావడంతో అమరావతి అనే పదంతో పోల్చినప్పుడు పలకడానికి, అర్థం చేసుకోవడానికి, ఇబ్బందులు తలెత్తడం సహజమే. కానీ, అమరావతి అనే ఊరు గుంటూరు (Guntur) జిల్లా కృష్ణా నదిలో పుట్టి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. తరువాత అది బౌద్దుల ఆరామంగా విలసిల్లింది.
చారిత్రకంగా అమరావతికి ఉన్న పేరును చంద్రబాబు (Nara Chandrababu Naidu) కొట్టేశాడు. వాస్తవంగా చంద్రబాబు నిర్మించదలిచిన అమరావతికి, ప్రాచీనకాలం నాటి అమరావతికి అసలు ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు చెప్పిన అమరావతికి చారిత్రక అమరావతి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పుడు బుద్ధ విగ్రహం కూడా కాలచక్ర సమావేశాల్లో భాగంగా దలైలామా, ఇతర ఆధ్యాత్మిక బౌద్ద గురువుల సారథ్యంలో నిర్మించిందే.
చంద్రబాబు, అతని అనుకూల మీడియా.. బౌద్దులు నిర్మించిన ఆనాటి విగ్రహాన్ని తెలివిగా, చంద్రబాబు కట్టాలనుకున్న అమరావతికి ఒక బ్రాండింగ్ గా వాడుకుంటోంది. గుంటూరు జిల్లా ప్రజలకు తప్ప ఈ వాస్తవం దాదాపు ఈ తరం వాళ్లకు గానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి గానీ తెలియదు. చంద్రబాబు ప్రాపగాండా మిషన్ ఇలాంటి అంశాలను ఎన్నింటినో దాచి, పురాతన పేర్లు, కట్టడాలను కూడా తమ ఖాతాలో వేసేసుకుంది. బహుశా దీన్ని వివరించి చెప్పడంలో కూడా న్యూట్రల్ పీపుల్ ఫెయిల్ అయ్యారు.
జగన్ ప్లాన్-బీలో భాగంగా, మావిగన్ (MA-VI-GUN) ప్రతిపాదన చేసినప్పుడు కూడా ఆ ప్రాంత ప్రాధాన్యతను, రాజధాని ప్రాంతంగా ఉన్న అనుకూలతను దాచి పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారు. జగన్ ఈ ప్రతిపాదన చేసినప్పుడు సహజంగానే టీడీపీ(TDP) ఉలిక్కిపడిందన్నది వాస్తవం. జగన్ ప్లాన్-బీ రియాల్టీకి దగ్గరగా ఉండడం, సహజంగా మూడు జిల్లాలు లబ్ధి పొందండం దీనికి కారణం.
అందుకే జగన్ ప్రెస్‌మీట్ జరిగిన అతి కొద్దిగంటల్లో తన ప్రాపగండా మిషన్‌ను చంద్రబాబు ఆన్ చేశాడు. పెయిడ్ అకౌంట్, నకిలీ ఖాతాల ద్వారా విస్తృతంగా మావిగన్ అనే పదం బూతు పదం అన్నట్టుగా పనిగట్టుకొని ప్రచారం చేయించాడన్నది విశ్లేషకుల వాస్తవ అభిప్రాయం.
నిన్న ప్రెస్మీట్లో చంద్రబాబు కూడా అసలు జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే పదాన్ని గుర్తించడానికి కూడా వెనకడుగు వేశాడు. ఇదంతా తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా పథకం ప్రకారం చేసిన పని అనేది బహిరంగ రహస్యం.
వాస్తవంగా దేశంలో గ్రోత్ కారిడార్లకు, పట్టణాభివృద్ధి సంస్థలకు భాషతో సంబంధం లేని పదాలు, ఎవ్వరికీ తెలియని పదాలు సంక్షిప్త రూపంలో ఉంటాయి. మన ఏపీ వరకు చూసుకుంటే.. MUDA (మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), TUDA (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), VUDA (విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), GUDA (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి.
వాస్తవంగా చూసుకుంటే.. GUDA, MUDA ఈ రెండు పదాల్లో కూడా తెలుగులో రెండు బూతు పదాలకు అత్యంత సామీప్యంలో కూడా ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు ఈ పదాలు రెండూ ట్రోలింగ్‌కు గురికాలేదు. అంటే, సమస్య పదాలతో కాదు అనేది స్పష్టం అవుతోంది.
ఈ విజ్ఞత, విచక్షణ అనేది మరచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలంగా ఉంటాం అంటూ… శత్రువులుగా వ్యవహరించే అనుకూల శత్రువులు కూడా చంద్రబాబు నాయుడు, టీడీపీ సోషల్ మీడియా ట్రాప్ లో పడ్డారు.
దేశ వ్యాప్తంగా కొన్ని కారిడార్లు..
AKIC (Amritsar-Kolkata Industrial Corridor)
CBIC (Chennai-Bengaluru Industrial Corridor)
DMIC (Delhi-Mumbai Industrial Corridor)
అంతర్జాతీయంగా ప్రముఖ కారిడార్లు
SanSan (USA)
San Francisco + San Diego, All in one corridor
BosWash (USA)
Boston + Washington, BosWash Corridor
మరికొంత మంది ఉద్దేశపూర్వకంగానే, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారిపై బురద జల్లడానికి టీడీపీ ట్రోలింగ్ అంశాన్ని వాడుకున్నారనేది పైన ఉన్న కారిడార్ల పేర్ల కూర్పును చూస్తే అర్థం అవుతోంది. జర్నలిస్టులుగా చెప్పుకుంటూ వారు కూడా టీడీపీ ట్రాప్‌లోనే పడిపోవడం, అవగాహన లోపాన్ని, విషయాన్ని గ్రహించడంలో సమర్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైఎస్సార్ సీపీ వార్తలను మాత్రమే అమ్ముకొని, మార్కెట్లో ఒక డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించామని చెప్పుకుంటున్న ఒకటి రెండు సంస్థలు, వైసీపీ అనుకూల శత్రువు కూడా పార్టీని దెబ్బతీయడాన్ని ప్రయత్నించి పరోక్షంగా టీడీపీకి సహాయపడ్డాయి.
వాస్తవం ఏమిటంటే.. మావిగన్ అనే పద ప్రయోగం ద్వారా ఆ పదానికి మద్దతు ఉందా..? లేదా..? అనేది పక్కనబెడితే.. వైఎస్ జగన్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రజల్లో టీడీపీ విస్తృతంగా ట్రోల్ చేయడం వల్ల, అనుకూల శత్రువుల వికృత, విన్యాసాల కారణంగా ఈ పదం ప్రజల్లోకి వెళ్లింది. సానుకూలంగానైనా, వ్యతిరేకంగా పదం ప్రజలకు చేరింది. ఈ ప్రెస్‌మీట్ తరువాత పార్టీ సోషల్ మీడియా, మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ఆ గ్రోత్ కారిడార్ సానుకూలతపైన తెర మీదకు తెచ్చిన అనేక అంశాలు, న్యూట్రల్ ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి.
వైఎస్ జగన్ సూచించిన ప్లాన్ బీ ప్రతిపాదనకు మూడు జిల్లాల్లో కూడా సానుకూలత వ్యక్తం అవుతోంది. మరొక్క విషయం ఏమిటంటే.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక వ్యూహం లేకుండా ఇలాంటి ఎత్తుగడకు దిగుతారా..? అని భావించే వాళ్ల వివేకవంతమైన పరిమితులు (ఇంటెలిజెన్స్ లిమిట్స్)ను బయటపెడుతుంది. అంతిమంగా ఇది జగన్ కరోనా సమయంలో సూచించిన పారాసిటమాల్ వివాదం లాంటిదే.. ఆ రోజు జగన్ చెబితే హేళనగా చూశారు.. తరువాత డబ్యూహెచ్ఓ ఆదేశాలివ్వడంతో ముక్కున వేలు వేసుకొని అంతా పాటించారు. మావిగన్ కూడా అలాంటిదేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.







