ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభలో (Legislative Assembly) నేడు అమరావతి రాజధాని (Amaravati Capital City) చట్టబద్ధతపై (Legal Status) జరిగిన ప్రత్యేక సమావేశం (Special Session) ఆసక్తికరంగా సాగింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు (Hyderabad) ఉన్న పదేళ్ల గడువు ముగిసిన నేపథ్యంలో, అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ఈ చర్చా వేదిక రాజధాని అభివృద్ధి కంటే గత ప్రభుత్వ విమర్శలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సభలో ‘జగన్’ నామస్మరణ!
సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ చర్చలో ప్రతి అధికార పక్ష ఒక్క సభ్యుడి ప్రసంగం కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రస్తావన లేకుండా సాగలేదు. సీఎం చంద్రబాబు (Chandrababu),, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి లోకేష్ (Nara Lokesh)లతో పాటు దాదాపు 20 మందికి పైగా సభ్యులు ప్రసంగించారు. ఒక్కో సభ్యుడు కనీసం 10 నుంచి 50 సార్లు జగన్ పేరును లేదా గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావించడమే పనిగా పెట్టుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- ప్రశ్నార్థకంగా మారిన అసలు చర్చ!
- రాజధానిపై జరగాల్సిన నిర్మాణాత్మక చర్చ పక్కదారి పట్టిందని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆశిస్తున్న కీలక అంశాలపై స్పష్టత లేదని వారు పాయింట్ అవుట్ చేస్తున్నారు.
- గడిచిన 13 ఏళ్లలో (విభజన తర్వాత) అమరావతిలో జరిగిన వాస్తవ అభివృద్ధి ఎంత?
- ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు?.
- అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి శాశ్వత భవనాల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది?
- వాటికి నిధులు ఎలా సమకూరుస్తున్నారు?.
- భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ఏ స్థాయిలో ఉంది? వారంతా సంతృప్తిగా ఉన్నారా?.
- అమరావతి తనను తాను పోషించుకునే ‘సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ’గా ఎప్పుడు అవతరిస్తుంది?
- అమరావతిపై చేస్తున్న అప్పుల భారం ఎంత..? ప్రజలపై ఆ భారం ఎలా పడనుంది..?
విమర్శలకే ఆరు గంటలా?
జగన్‌ను లేదా వైసీపీని విమర్శించడానికి బయట అనేక వేదికలు ఉన్నాయని, అత్యంత విలువైన అసెంబ్లీ సమయాన్ని కేవలం దూషణలకే కేటాయించడం సరైనదేనా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికను వివరించడం కంటే గత ప్రభుత్వ తప్పులను ఎండగట్టడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోందని చర్చ జరుగుతోంది.







