దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి గవర్నర్ల బదిలీ, కొత్త నియామకాలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ఓవైపు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోగా, మరోవైపు రాష్ట్ర పాలనలో కొత్త మార్పుల దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒడిశా గవర్నర్‌గా కొనసాగుతున్న రఘుబర్ దాస్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బిహార్‌కు బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా నియమించారు.
మిజోరాం గవర్నర్‌గా జనరల్ వీకే సిన్హా నియమితులయ్యారు. మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా బాధ్యతలు చేపట్టనున్నారు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’