ఏపీలోనూ మొదలైన పెట్రోల్ పరేషాన్.. ‘నో స్టాక్’ బోర్డులు

ఏపీలోనూ మొదలైన పెట్రోల్ పరేషాన్.. 'నో స్టాక్' బోర్డులు

ఆంధ్ర‌రాష్ట్రంలోనూ (Andhra State) పెట్రోల్ సరఫరాపై (Petrol Supply) ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. గత రెండు రోజులుగా మ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో (Petrol Bunks) ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు వెలవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు
ఏలూరు, తిరువూరులోని ప్రధాన బంకుల్లో పెట్రోల్ అయిపోయిందన్న వార్త దావానంలా వ్యాపించడంతో, స్టాక్ ఉన్న ఇతర బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. భవిష్యత్తులో మరింత కొరత ఏర్పడుతుందనే భయంతో చాలామంది తమ వాహనాలకు ‘ఫుల్ ట్యాంక్’ (Full Tank) చేయించుకుంటున్నారు. దీంతో బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడి సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి
కృష్ణా జిల్లాలోని కైకలూరు, తిరువూరు వంటి ప్రాంతాల్లోనూ పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. కైకలూరులో మెజారిటీ బంకులు మూతపడగా, తిరువూరులో తెరిచి ఉన్న బంకుల ముందు వందలాది వాహనాలు వేచి ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఇంధన సరఫరాపై పడవచ్చనే వదంతులే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

అధికారులు ఏమంటున్నారు?
రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని, కేవలం వదంతుల వల్లే ప్రజలు భయాందోళనతో భారీగా బంకులకు వస్తున్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లోకల్ డిపోల నుంచి సరఫరా ప్రక్రియలో చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని చెబుతున్నారు. అనవసరంగా పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని, ఆందోళన చెందవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment