పాత తరం కాంగ్రెస్ నాయకుడు టి. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (Y. S. Rajasekhara Reddy), ఆయన కుమారుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy)పై వచ్చిన క్విడ్ ప్రో కో (Quid Pro Quo) అవినీతి ఆరోపణలు ప్రత్యర్థి పార్టీల నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కూడా వచ్చినవేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో మాట్లాడుతూ, వైఎస్ కుటుంబంపై (YS Family) అవినీతి ముద్ర వేయడంలో కాంగ్రెస్‌లోని కొంతమంది నేతల పాత్ర కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలే జగన్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టడానికి కారణమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రత్యేకంగా 2011 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, జగన్ మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అనంతరం జగన్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో ఆ కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, క్విడ్ ప్రో కో కేసులు, అధికార పోరాటం వంటి అంశాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది.









కూటమిలో ‘సమన్వయ’ సెగ.. పవన్‌కు ఫిర్యాదు