ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన వరుస విజయాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందిన నటి అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి మరోసారి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు (Wedding Stage) ఎక్కబోతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 44 ఏళ్ల ఈ స్టార్ హీరోయిన్‌కు కుటుంబానికి దగ్గరగా ఉన్న ఓ ప్రముఖ వ్యాపారవేత్త తో (Businessman) వివాహం జరగబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రెండు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి (Wedding) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అనుష్క పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అనుష్క కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. చాలా కాలం క్రితం ఒప్పుకున్న ఒక మలయాళ సినిమా మాత్రమే ఆమె చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఎలాంటి అప్డేట్లు బయటకు రావడం లేదు. ఇటీవల విడుదలైన ‘ఘాటి’ సినిమా సమయంలో ఆమె లుక్‌పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. సినిమాలో గ్రాఫిక్స్ ద్వారా ఆమెను సన్నగా చూపించారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అనుష్క నిజంగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవుతుందా? లేక ఇవన్నీ కేవలం రూమర్లేనా? అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.








