నాకు ప్రాణ‌హాని.. మంచు విష్ణుపై మ‌నోజ్ ఫిర్యాదు

నాకు ప్రాణ‌హాణి.. మంచు విష్ణుపై మ‌నోజ్ ఫిర్యాదు

మోహన్ బాబు కుటుంబంలో మరోసారి వివాదాలు చెలరేగాయి. ఈసారి అన్న‌ మంచు విష్ణుపై త‌మ్ముడు మంచు మనోజ్ ప‌హ‌డీష‌రీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడు అంశాలపై విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో పరస్పర ఆరోపణలు పెరిగాయి. త‌న అన్న‌ విష్ణు నుంచి తనకు ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. ఇక, విష్ణుతో పాటు వినయ్‌పై కూడా ఫిర్యాదు నమోదైంది. ఈ పరిణామాలు మోహన్ బాబు కుటుంబంలో మరింత కలకలం రేపుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా.. జ‌ర్న‌లిస్టుపై దాడి కేసులో నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. జ‌ల్‌ప‌ల్లిలోని మంచు నివాసంలో జ‌రుగుతున్న‌ వివాదాల‌ను క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుపై మోహ‌న్‌బాబు దాడి చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహ‌న్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ తిరస్కరించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment