ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్‌!

ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్‌!

Summarize with AI

2025 ఫిబ్రవరి 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పనిచేయ‌నున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడటమే. ఈ మేరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు సోమవారం సర్క్యులర్ విడుదల చేశాయి. బడ్జెట్ ప్రకటనల అనంతరం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించడమే ఈ ప్రత్యేక చర్య వెనుక ఉద్దేశ్యం.

ఇలాంటి సందర్భాలు గతంలో 2020 మరియు 2015ల్లోనూ చోటుచేసుకున్నాయి. బడ్జెట్ రోజున ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తయారీ మరియు హెల్త్‌కేర్ రంగాలకు సంబంధించిన షేర్లలో అధిక చలనం కనిపిస్తుంది. బడ్జెట్ ప్రభావం కారణంగా స్టాక్స్ రేట్లు నిమిషాల్లో మారుతూ ఉంటాయి. బడ్జెట్ సమయంలో చేసే ప్రకటనలు ఆ ఆర్థిక సంవత్సరం మొత్తం మార్కెట్ ట్రెండ్‌లను, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment