ఎన్టీఆర్– నీల్ ‘డ్రాగన్’ షూటింగ్ మళ్లీ షురూ

ఎన్టీఆర్– నీల్ ‘డ్రాగన్’ షూటింగ్ మళ్లీ షురూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా స్టార్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మరోసారి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అనిల్‌ కపూర్ మరియు మలయాళ స్టార్ టోవినో థామస్‌ కనిపించనున్నట్లు సమాచారం.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ జోర్డాన్‌లో పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, టోవినో థామస్ పాల్గొని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచే ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం మూడు భారీ సెట్స్‌ను ప్రత్యేకంగా నిర్మించినట్లు తెలిసింది. అందులో విలన్ ఇంటి సెట్ కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సెట్స్‌లోనే దాదాపు నెల రోజులపాటు షూటింగ్ జరగనుందని సమాచారం.

ఈ షెడ్యూల్ పూర్తయ్యాక ‘డ్రాగన్’ టీమ్ తదుపరి షూటింగ్ కోసం శ్రీలంక కు వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ భారీ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ యర్ననేని, వై. రవి శంకర్, కోశరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంగీతాన్నిరవి బస్రూర్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment