‘డాకు మహారాజ్’పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

'డాకు మహారాజ్'పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డాకు మహారాజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక వివరాలను వెల్లడించారు. డాకు మహరాజ్ ప్రమోషన్ కోసం జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామ‌ని, మరో ఈవెంట్‌ను విజయవాడలో కూడా నిర్వహించబోతున్నాం అని తెలిపారు.

దర్శకుడు బాబీ గురించి మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య’ కంటే ‘డాకు మహారాజ్’ సినిమాను బాబీ ఎంతో గొప్ప‌గా తీశారని, ఈ విషయాన్ని చెప్పడంలో చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకుంటార‌ని త‌న‌కు ఎటువంటి బాధ లేదని చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు.

నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి, బాలయ్య అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వాదనలు చేస్తున్నారు. ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందే ఈ రకమైన ప్రచారం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment