తెలంగాణలో (Telangana) రాజకీయ రంగం మరోసారి ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె (Daughter) కొండా సుస్మితా పటేల్ (Konda Sushmita Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వరంగల్ జిల్లాలోని కొమ్మాల జాతర వేదికపై మాట్లాడిన సుస్మితా తాను తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని, పరకాల ప్రాంతం (Parkal Constituency) నుంచి ఎమ్మెల్యేగా(MLA) పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రయాణం ఇదే వేదికన ప్రారంభమైందని, తన రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుండే మొదలవుతుందని ఆమె చెప్పారు.
సుస్మితా వ్యాఖ్యల ప్రకారం, “కొండా మురళీ (Konda Murali) ఇప్పటికే ముగ్గురు నలుగురు గుండెల్లో నిద్ర పోతున్నాడు.నేను పరకాలకు వస్తూ మీ సమస్యలను పరిష్కరిస్తాను. ప్రతీ కార్యక్రమంలో పాల్గొని, ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మా నాన్న సూచన ప్రకారం నెమ్మదిగా మాట్లాడుతున్నా, లేకపోతే మరింత ప్రభావవంతంగా ఉంటుంది” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో పరకాల రాజకీయ వేదికపై పెద్ద చర్చకు దారితీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.








