మిడిల్ ఈస్ట్‌లో (Middle East) యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఇజ్రాయెల్‌కు (Israel) మరియు అమెరికాకు (United States) మద్దతు ఇచ్చే దేశాల ప్రజలను లక్ష్యంగా ఇరాన్(Iran) నుంచి బాంబులు కురుస్తున్నాయి. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్‌లోని ఇరానేతరుల నివాసాలు, హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్లపై దాడులు జరుగుతున్నాయి. ప్రజలు భయంతో ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరింతగా, సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. తస్-తనోరాలోని ఆరామ్ కో ఆయిల్ రిఫైనరీ ప్రధాన లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి, దీని కారణంగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
ఖతార్ (Qatar) రాజధాని దోహాలో (Doha) భారీ పేలుళ్లు సంభవించడంతో అక్కడి పరిస్థితి మరింత ఉద్వేగభరితమైంది. ఇరాన్ టార్గెట్ మారడంతో ప్రధాన ప్రభావం భారతీయులపై పడింది. గల్ఫ్ దేశాల్లో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు (Indian Expatriates) ఉన్నారు, వారు ఎప్పుడేం ప్రమాదం ఎదురవుతుందో తెలియని భయంతో కంగారు పడుతున్నారు. ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబిలోనూ భయంతో ప్రతీ క్షణం జీవించాల్సి వస్తోంది. వేలాది మంది ప్రయాణికులు, పని చేసే ఉద్యోగులు, కుటుంబ సభ్యులు గల్ఫ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు, వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వ చర్యలు వేగవంతం కావాల్సిన పరిస్థితి నెలకొంది.








