టీవీకే అధినేత విజ‌య్‌కి షాకిచ్చిన స‌తీమ‌ణి

టీవీకే అధినేత విజ‌య్‌కి షాకిచ్చిన స‌తీమ‌ణి

Summarize with AI

తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ (TVK Party) అధినేత‌ దళపతి విజయ్‌ (Thalapathy Vijay)కు ఆయన భార్య (Wife) సంగీత (Sangeetha Vijay) బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు (Divorce) కావాలని కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్త విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. సినీ నటితో వివాహేతర సంబంధమే విడాకులకు కారణమని పిటిషన్‌లో పేర్కొంది. చెంగల్పట్టు కోర్టులో (Chengalpattu Court) ఆమె డైవర్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 20న తమ ముందు హాజరుకావాలని కోర్టు విజయ్‌కు సమన్లు జారీ చేసింది. విజయ్, సంగీతలకు ఆగస్టు 25, 1999లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గతేడాది నుంచి సంగీత విజయ్‌తో విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. విజయ్ ఇటీవల ఓ స్టార్ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత విడాకులు కోరడం తమిళనాడులో సంచలనంగా మారింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్, తన పార్టీ టీవీకే ప్రచారంలో ముందుకెళ్తుంటే ఈ సమయంలో భార్య విడాకులు కోరారు. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించనున్న‌ట్లు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay), కుమార్తె దివ్యా షాషా (Divya Saasha) ఉన్నారు. జాసన్ ప్రస్తుతం డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మయ్యాడు. 2021లో తన భర్తకు సినీ నటిలో ఎఫైర్ ఉందని కనుగొన్నానని, దీంతోనే చట్టబద్ధంగా విడిపోవాలని అనుకుంటున్నట్లు సంగీత పేర్కొన్నారు. విజయ్ ఎఫైర్ ముగుస్తుందని హామీ ఇచ్చినప్పటికీ, అది అలాగే కొనసాగిందని పిటిషన్ పేర్కొంది.

విజయ్ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు ఆమె ఆరోపించారు. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద ఆమె విడాకులు కోరింది. ఈ సెక్షన్లు వివాహేతర సంబంధం, క్రూరత్వాన్ని సూచిస్తాయి. విజయ్ తనపై క్రూరత్వానికి పాల్పడినట్లు సంగీత పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment