విశాఖ రైల్వే స్టేషన్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

విశాఖ రైల్వే స్టేషన్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22606) ఉదయం 5.20 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుకుంది. ఇంజిన్ మార్పు ప్రక్రియలో భాగంగా తొలగించిన ఇంజిన్ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంత దూరం వరకు లాక్కెళ్లింది.

సిబ్బంది అప్రమత్తతతో..
రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటన రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. వెంట‌నే రైల్వే సిబ్బంది విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

రైల్వే ప్రయాణికుల అసౌకర్యం
ఈ ఘటనతో కొన్ని రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి, ప్రయాణికులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. రైల్వే సిబ్బంది ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment