సూర్య మద్దతుతో అభిషేక్ మళ్లీ ఫామ్‌లోకి

సూర్య మద్దతుతో అభిషేక్ మళ్లీ ఫామ్‌లోకి

టీమిండియా (Team India) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రస్తుత ఫామ్‌తో విమర్శల కేంద్రమై ఉన్నప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అతడిపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్ (Netherlands) మ్యాచ్ అనంతరం రిపోర్టర్ ప్రశ్నకు స్పందిస్తూ, “అభిషేక్ శర్మ ఎంత ప్రతిభావంతుడో అందరికీ తెలుసు. ప్రస్తుతం పరుగులు రాకపోయినా, జట్టులో ప్రతి ఒక్కరికీ అతడిపై పూర్తి విశ్వాసం ఉంది. త్వరలోనే అభిషేక్ మళ్లీ తన సహజ ఆటతో పరుగుల వరద పారుస్తాడని నమ్మకం ఉంది” అని చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అయిన అభిషేక్, టీ20 వరల్డ్ కప్ 2026లో వరుసగా డకౌట్స్ సాధించారు. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లలో వరుసగా ఫెయిల్ అయిన కారణంగా, భారత్ తరఫున అత్యధిక డకౌట్లు సాధించిన ఆటగాడిగా ఆయన నిలిచారు. అయినప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ మద్దతుతో, అభిషేక్ త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తారని అభిమానుల్లో అంచనా వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment