మ‌ద‌న‌ప‌ల్లి ఘటన చ‌ల్లార‌క‌ముందే.. రంగాపురంలో మరో దారుణం

మ‌ద‌న‌ప‌ల్లి ఘటన చ‌ల్లార‌క‌ముందే.. రంగాపురంలో మరో దారుణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం చిన్నారుల‌పై వ‌రుస ఘ‌ట‌న‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. విచ్చ‌ల‌విడి మ‌ద్యం, గంజాయి ల‌భ్యం మూలంగా మ‌గాళ్లు మృగాల్లా మారుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నిన్న మ‌ద‌న‌ప‌ల్లిలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించ‌గా, తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌రో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. బిక్క‌వోలు మండలం రంగాపురం గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో నిందితుడికి రాజకీయ అండ ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏమి జరిగింది?
రంగాపురం గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయ‌కుడి కుమారుడు నంగన నరసింహ మూర్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడు గ్రామ టీడీపీ శాఖ మాజీ అధ్యక్షుడి తనయుడు కావ‌డంతో, న్యాయం కోసం వెళ్లిన బాధితురాలి త‌ల్లిదండ్రుల‌పై మార‌ణాయుధాల‌తో రెచ్చిపోయాడు. ఘటన అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే అండ ఉందంటూ ఆరోపణలు
ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిందితుడికి అండగా నిలిచార‌ని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. “ఇదేమి ప్రభుత్వం?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఆడ‌పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపించాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి తీసుకువ‌చ్చార‌ని, న్యాయం కోసం వెళ్తే త‌మ‌పై దాడి చేసి రివ‌ర్స్ కేసు న‌మోదు చేశార‌ని మండిప‌డ్డారు.

బాధిత కుటుంబంపైనే హత్యాయత్నం కేసు
నిందితుడిని ప్రశ్నించేందుకు వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులపైనే హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వారు వాపోయారు. మూడు రోజుల పాటు బిక్క‌వోలు పోలీస్ స్టేష‌న్ చుట్టూ తిప్పించుకున్నారని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించగా, ఇటీవల వారు బెయిల్‌పై విడుదల‌య్యారు.

న్యాయం చేయాలని డిమాండ్
పోక్సో కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి నిజాలు బయటపెట్టాలని వారు కోరుతున్నారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆడ‌వారిపై అఘాయిత్యాలు జ‌రుగుతున్న అధికారం అండ‌తో నిందితుల‌కు కొమ్ము కాస్తున్న ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment