ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపెట్టాడు. ఇటీవల సుమారు 122 మీటర్ల ఎత్తులో డ్రోన్ నుంచి వేగంగా వదిలిన క్రికెట్ బంతిని అద్భుత టైమింగ్‌తో కళ్ళప్పగించి క్యాచ్ చేశాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ వీడియోను షేర్ చేసి బట్లర్ ప్రతిభను ప్రశంసించాడు.
ఈ క్యాచ్ గిన్నిస్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్పబడుతోంది, 2021లో ఆస్ట్రేలియాకు చెందిన థిమోతి షానన్ 119.86 మీటర్ల ఎత్తు నుంచి క్యాచ్ పట్టి రికార్డు సాధించాడు. అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండాల్సి ఉన్నప్పటికీ, త్వరలో బట్లర్ పేరు గిన్నిస్ బుక్‌లో చోటు చేసుకోనున్నట్టు కనిపిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఆ రెండు మ్యాచ్‌లలో బట్లర్ వరుసగా 26 & 21 పరుగులు చేశాడు. మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ, పెద్ద స్కోర్‌కి మార్చలేకపోయాడు. గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్‌లను స్కాట్లాండ్, ఇటలీతో ఆడనుంది. బట్లర్ ధనాధన్ బ్యాటింగ్, అద్భుత కీపింగ్ ప్రతిభతో ఆ ఆటల్లో కూడా జట్టుకు కీలక పాత్ర పోషించనున్నాడు.








