Jailer 2 Movie Review : ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. ముత్తువేల్ పాండియన్ టెర్రర్

Jailer 2 Movie Review : 'జైలర్ 2' మూవీ రివ్యూ.. ముత్తువేల్ పాండియన్ టెర్రర్

Summarize with AI

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి భాగం ఇచ్చిన భారీ హిట్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉందంటూ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇంటర్నెట్, ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న రివ్యూల ఆధారంగా సినిమా ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

జైలర్ 2 కథ ఏంటంటే..
పోలీస్ అధికారి అయిన తన కొడుకు చనిపోయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కోయంబత్తూరులో ఒక సూపర్ మార్కెట్‌లో టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన కొడుకు చనిపోవడానికి కారణమైన వర్మ (వినాయకన్) పైన ఉన్న బాస్ ఎవరో క‌నిపెట్టి ఆ వ్య‌క్తిని అంతం చేయాల‌ని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతనికి దిలీప్ (సురాజ్ వెంజారమూడు) కూడా అదే గ్యాంగ్‌కు సంబంధించిన వ్య‌క్తిని తెలుస్తుంది.

దిలీప్ ద్వారా వర్మ బాస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ముత్తువేల్‌. మరి ఈ ప్రయత్నం ఫలించిందా? అసలు ఆ బాస్ ఎవరు? టైగర్ స్నేహితులు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, హృతిక్ రోషన్ ఎలా సహాయపడ్డారు? ఈ కథలో బోధి (ఎస్.జె. సూర్య), కాంత (విద్యాబాలన్), చక్రి (మిథున్ చక్రవర్తి) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

  • ప్లస్ పాయింట్స్
  • టైగర్ ముత్తువెల్ పాండియన్‌గా రజనీ స్టైల్, మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం. ఆయన ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ చేత ఈలలు వేయిస్తున్నాయి.
  • సినిమా మొదటి అర్ధభాగం (First Half) నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నెల్సన్ తనదైన డార్క్ హ్యూమర్, యోగి బాబు టీంతో కూడిన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, కథను వేగంగా నడిపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.
  • రెండో భాగం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సెంటిమెంట్, డ్రామాతో సాగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
  • విద్యా బాలన్, ఎస్.జె. సూర్య నటన సినిమా స్థాయిని పెంచగా.. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌లతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గెస్ట్ అప్పియరెన్స్ లేదా కీలక పాత్రలు సినిమాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలిచాయి.
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనిరుధ్ ఇచ్చిన ఆర్జీఆర్ మ్యూజిక్ మాస్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది.

తుది తీర్పు
‘జైలర్ 2’ రజనీకాంత్ అభిమానులకు పూనకాలు తెప్పించే పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. నెల్సన్ మార్క్ ట్రీట్‌మెంట్, అనిరుధ్ మ్యూజిక్, అదిరిపోయే కాంబినేషన్ సీన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

రేటింగ్: 3.0 / 5

Join WhatsApp

Join Now

Leave a Comment