పొలిటికల్ ఎంట్రీ పై హీరో అర్జున్ క్లారిటీ

పొలిటికల్ ఎంట్రీ పై హీరో అర్జున్ క్లారిటీ

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో కొత్త విషయం కాదు. ఎన్టీఆర్, విజయ్ వంటి హీరోలు రాజకీయాల్లోకి ప్రవేశించి తాము సృష్టించిన గుర్తింపుతో రాజకీయ చక్రాన్ని తిప్పారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు, మరియు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తారా అనే అంచనాలు వార్తలలో హవా పుట్టించాయి. అయితే, అర్జున్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై పూర్తిగా నిరాకరించారు.

అర్జున్ తెలిపారు, “నాకు రాజకీయాల్లోకి రావాలని అంత ఆసక్తి లేదు. నేను మంచి పనలు చేయాలనుకుంటున్నాను. కానీ రాజకీయాల ద్వారా కాదని అర్జున్ తెలిపారు. ప్రస్తుతం నటన, కథలు రాయడం, సేవా కార్యక్రమాలు చేస్తూ హ్యాపీగా ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నా వద్ద లేదు.” విజయ్ రాజకీయ ప్రవేశం గురించి అర్జున్ చెప్పగా, “ఎవరైనా మంచి పని చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి రావచ్చు. విజయ్ ఇంకా కొత్తగా ఉన్నాడు, ఆయన పని తీరు ఎలా ఉంటుంది అని చూడాలి. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూసే అంశం ఇది” అని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment