సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు పుట్టుకొస్తుంటాయి. వాటిలో కొన్ని కేవలం కొన్ని రోజుల్లో మర్చిపోతాం, కానీ కొన్ని మాత్రం మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. అలాంటి వీడియోల్లో ఒకటి టీ గ్లాస్ చేతిలో పట్టుకుని నవ్వే యువకుడు అరుణ్ యొక్క వీడియో. ఆ నవ్వు చూసిన ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు తాకుతుంది. ఈ సహజమైన, స్పూరదాత్మక నవ్వు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, కేవలం కొద్దీ రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించింది.
అరుణ్ తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాలపల్లి గ్రామానికి చెందిన ఓ సాధారణ యువకుడు. జీవనోపాధి కోసం లారీ క్లీనర్‌గా పని చేస్తున్న అతను, టీ తాగుతూ సరదాగా ఉండే జోక్ వలన పకపక నవ్విన క్షణాన్ని లారీ డ్రైవర్ నెహ్రూ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ సహజ నవ్వు ఇంత పెద్ద గుర్తింపును తెచ్చింది, మేమ్‌లలో, కామెడీ వీడియోల్లో వినియోగం క్రమంగా ట్రేడ్‌మార్క్‌గా మారింది.
అయితే ఈ వైరల్ గుర్తింపు వెనుక అరుణ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. పేదరికం కారణంగా నాలుగో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. చిన్న వయసులోనే పని ప్రారంభించాల్సి వచ్చింది. కానీ డ్రైవర్ నెహ్రూ ప్రోత్సాహంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టి, ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. నిజానికి ఒక చిన్న, సహజ నవ్వు అతని జీవితాన్ని మార్చేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్