చర్లపల్లి రైల్వే ట్రాక్‌పై జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తొమ్మిది రోజులు గడిచినా ఈ కేసులోని మిస్టరీ వీడకపోవడంతో సస్పెన్స్ మరింత పెరుగుతోంది. తల్లి విజయశాంతి రెడ్డి తన ఇద్దరు ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఈ అతి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? పిల్లలను ఆత్మహత్యకు ఎలా ఒప్పించింది? లేదా తల్లి నిర్ణయానికి పిల్లలు ఎలా అంగీకరించారు? అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి నిపుణుల వరకూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఎవరికీ చెప్పుకోలేని మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలా? లేక మరేదైనా లోతైన కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న జీఆర్పీ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. కాల్ డేటా, మొబైల్ లొకేషన్, డిజిటల్ లావాదేవీలు, వ్యక్తిగత పరిచయాలు అన్నింటినీ క్రాస్ చెక్ చేస్తున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విజయశాంతి రెడ్డి ఇలా పిల్లలతో కలిసి సూసైడ్‌కు పాల్పడటం వెనుక అసలు కారణాలేంటి అనే అంశమే ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులోని ప్రతి కోణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిజాలు బయటకు తీసుకొస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో, పూర్తి నిజం ఎప్పుడెప్పుడు వెలుగులోకి వస్తుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








