సమాజంలో ఎంతో గౌరవం ఉండే ఎమ్మెల్యే పదవి అర్థాన్నే మార్చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో మహిళల పట్ల కొందరు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. అధికారం ఉందనే ధీమాతో కన్నూ మిన్నూ కానకుండా మహిళలు, యువతులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. కూటమి ఎమ్మెల్యేల వేధింపులు తాళలేక పలువురు మహిళలు ఆత్మహత్యాయత్నం కూడా చేసిన ఘటనలు ఉన్నాయి. రాసలీలలతో వివాదాస్పదంగా మారిన కూటమి ఎమ్మెల్యే ఎవరెవరో చూద్దాం..
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వం సంచలనం సృష్టిస్తోంది. అరవ శ్రీధర్ దారుణంగా వేధించి దౌర్జన్యాలకు పాల్పడినట్లు బాధితురాలు సెల్ఫీ వీడియో ద్వారా బహిర్గతం చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో జరిపిన నికృష్టమైన చాటింగ్‌లు, అసహ్యం పుట్టించే నగ్న వీడియోలను సాక్ష్యాధారాలుగా చూపించింది. తాను రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నానని.. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని తనను కారులో తీసుకెళ్లి కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారని వాపోయింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల ఐదు సార్లు గర్భం దాల్చానని, ఎమ్మెల్యే ఒత్తిడితో అబార్షన్ చేయించుకున్నానని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.
ఎమ్మెల్యే నసీర్ వెకిలి చేష్టలు (3-8-2025)
టీడీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరును చూసి కూటమి నేతలను ప్రజలు అసహ్యించుకున్నారు. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు స్పష్టమవుతోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది.
🚨Breaking 🚨
— Telugu Feed (@Telugufeedsite) August 4, 2025
గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే @mdnaseer_tdp వీడియో లీక్
మహిళతో @JaiTDP MLA వీడియో కాల్లో మాట్లాడుతున్న వీడియో బట్టబయలు
గతంలో సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నగ్న వీడియో హల్చల్ pic.twitter.com/WPmx8rPOAi
కోనేటి ఆదిమూలం వీడియో.. మహిళ ఫిర్యాదు (5-9-2024)
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనతో మాట్లాడాలి రమ్మంటూ ఒక హోటల్ ల్ కు పిలిచి తనపై అఘాయిత్యంచేశారని గత సెప్టెంబరులో అదే పార్టీకి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఆదిమూలం తనకు పంపిన అసభ్యకర మెసేజ్ లు, బెదిరింపుల ఆడియోలు, రాసలీలల వీడియోలను ఏకంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమక్షంలో చూపించారు. తన మాట వినకపోతే ఆమె భర్తను, పిల్లలను చంపేస్తానని బెదిరించారని వాపోయింది. సెటిల్ చేసుకుందామని రూమ్ కు పిలిచి లైంగిక దాడిక పాల్పడ్డాడని ఆరోపించింది. కాగా, ఆదిమూలం మరో మహిళతో అసభ్యకర సంభాషణలతో కూడిన ఆడియో క్లిప్పులు అక్టోబర్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు 🤬💦#SaveAPFromTDP pic.twitter.com/Mjyz24oTJZ
— Be With Jagan (@BewithJagan) September 5, 2024
కేజీబీవీ ప్రిన్సిపల్ ను వేధించిన టీడీపీ ఎమ్మెల్యే కూన
శ్రీకాకుళం ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధించారని 2025 ఆగస్ట్ లో పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రెజిటీ సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. రాత్రి సమయాల్లో వీడియో కాల్స్ చేయాలని, తన ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారని వాపోయారు. తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించి వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.
దళిత మహిళా ప్రిన్సిపల్‌పై @JaiTDP ఎమ్మెల్యే కక్ష సాధింపు
— Telugu Feed (@Telugufeedsite) August 14, 2025
ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని KGBV ప్రిన్సిపల్ కన్నీరు
కక్ష కట్టి, అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ తనను బదిలీ చేయించాడని మండిపాటు
నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే స్థానిక… pic.twitter.com/Z60zs3H9ju








జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్