గంజాయి ముఠా అరాచకం.. మహిళా కానిస్టేబుల్‌పై దాడి

నిజామాబాద్‌లో గంజాయి ముఠా అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పై దాడి

గంజాయి ముఠా (Ganja Gang) అమానుషపు అరాచకానికి తెగపడింది. నిర్మల్ (Nirmal) కు చెందిన ముఠా సభ్యులు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో వాళ్లని పట్టుకునేందుకు నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య (Soumya) ప్రయత్నించింది. పోలీసుల నుంచి తప్పుంచుకునేందుకు ముఠా గుంపు కానిస్టేబుల్ (Woman Constable) సౌమ్యని కారుతో ఢీకొట్టింది. ఈ ఘాతుకర ఘటనలో సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి తక్షణ చికిత్స ప్రారంభించారు.

ఘటనపై సమగ్ర విచారణలో, ఎక్సైజ్ పోలీసులు మహమ్మద్ సోఫియోడ్డిన్ (Mohammad Sofiyoddin), సయ్యద్ సాయల్ (Syed Sayal) అనే ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీసులు, నిర్మల్ ప్రాంతంలో ఈ ముఠా కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ ధైర్యం దేశవ్యాప్తంగా ప్రశంసనీయమని, చట్టం పై నిరంతర నిబద్ధతకు ఒక స్పష్టమైన సందేశం అని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment