మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా, ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన ప్రశంసల ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్దాలుగా సంక్రాంతి పండుగకు చిరంజీవి సినిమా (Chiranjeevi Movie) అంటేనే ప్రత్యేక క్రేజ్ ఉండగా, ఈ ఏడాది కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయింది.
సినిమా సాధిస్తున్న ఘన విజయం పట్ల స్పందించిన బన్నీ, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను కొనియాడుతూ “బాస్ ఈజ్ బ్యాక్” (Boss Is Back) అంటూ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచారు. వింటేజ్ చిరు వైబ్స్, పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అల్లు అర్జున్ తన ట్వీట్‌లో నటీనటుల ప్రదర్శనతో పాటు సాంకేతిక బృందాన్ని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరంజీవి కామెడీ టైమింగ్, గ్రేస్‌కు ఫిదా అయిన బన్నీ, విక్టరీ వెంకటేష్ పోషించిన ‘వెంకీ గౌడ’ పాత్ర షోను రాక్ చేసిందన్నారు. నయనతార హుందాతనం, క్యాథరిన్ ట్రెసా కామెడీ, సంక్రాంతి స్టార్ బుల్లిరాజు ఎనర్జీ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పారు.
అలాగే #HookStep, #MegaVictory పాటలు థియేటర్లలో పండుగ వాతావరణాన్ని తెచ్చాయని పేర్కొంటూ, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు సుష్మిత కొణిదెల, సాహు గారపాటిని అభినందించారు. దర్శకుడు అనిల్ రావిపూడిని “బ్లాక్‌బస్టర్ మెషిన్”గా అభివర్ణిస్తూ, ఈ చిత్రం నిజంగా ఒక “బాస్”-బస్టర్ అని బన్నీ తన ట్వీట్‌తో హైలైట్ చేశారు.








