సినిమా టికెట్స్ ధరల పెంపు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్స్ ధరల పెంపు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్ ధరల పెంపు (Movie Ticket Price Hike)అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదల అయినా, టికెట్ ధరలు పెంచాలంటే కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వ ఉత్తర్వులు రావాలని స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుత విధానంలో మార్పులు అవసరమని అభిప్రాయపడిన కోర్టు, ఈ అంశంపై స్పష్టత, పారదర్శకత తప్పనిసరి అని వెల్లడించింది.

ఈ వ్యవహారంలో శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపున‌కు సంబంధించిన అంశంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ (Advocate Vijay Gopal) హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రేక్షకులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని, నిర్మాతలు పరిస్థితిని అవకాశంగా మార్చుకుని అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిర్ణీత గడువు లేకుండా హఠాత్తుగా ధరలు పెంచేందుకు అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని కూడా ఆయన వాదించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి కీలక నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.

ఈ తీర్పు తెలుగు సినిమా పరిశ్రమలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ముఖ్యంగా టికెట్ ధరల విషయంలో నియంత్రణ, పారదర్శకత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో నైజాం ప్రాంతంలో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు భవిష్యత్తులో టికెట్ ధరల పెంపుకు అనుకూల పరిస్థితులు ఉంటాయా లేదా అన్న చర్చ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment