క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి రష్యా ముందడుగు వేసింది. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. రష్యా ఆరోగ్య శాఖ మంత్రి వివరాల ప్రకారం.. ఈ వ్యాక్సిన్ జనవరి 2025 నుంచి రష్యన్ పౌరులకు ఉచితంగా అందించనున్నారట.
ప్రముఖ సంస్థల పాత్ర
గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.
వ్యాక్సిన్ లక్ష్యం..
ఈ వ్యాక్సిన్ ప్రధానంగా క్యాన్సర్ వ్యాప్తిని నియంత్రించడం, రోగులకు చికిత్స అందించడం లక్ష్యంగా ఉంచుకుంది. అన్ని రకాల క్యాన్సర్లపై పని చేయగల సామర్థ్యం ఉందని రష్యా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.
ప్రపంచ దృష్టి రష్యాపై..
ఇప్పటికే గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్, మోడర్నా, మెర్క్ & కో వంటి సంస్థల ప్రయోగాలు ఉన్నప్పటికీ, రష్యా తయారు చేసిన ఈ కొత్త వ్యాక్సిన్ అన్ని రకాల క్యాన్సర్లపై ప్రభావవంతంగా పనిచేయగలదని నమ్మకంగా చెబుతోంది.
భవిష్యత్‌పై ఆశలు
ఈ వ్యాక్సిన్ ప్రపంచంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్యాన్సర్ చికిత్సలో ఇది శాస్త్రీయ చరిత్రను మలుపు తిప్పే అవకాశం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రష్యా తీసుకున్న ఈ ముందడుగు ఇతర దేశాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.