మరో మ్యాచ్‌ ఆడనున్న విరాట్‌ కోహ్లీ!

మరో మ్యాచ్‌ ఆడనున్న విరాట్‌ కోహ్లీ!

Summarize with AI

విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2025-26 మూడో రౌండ్ మ్యాచ్‌లు నేడు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఢిల్లీ-సౌరాష్ట్ర మరియు ముంబై-ఛత్తీస్‌గఢ్ జట్లు బరిలోకి దిగాయి. ఢిల్లీ జట్టులో కింగ్ విరాట్ కోహ్లీ (King Virat Kohli), ముంబై జట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ రోజు మ్యాచ్ ఆడలేదు. బీసీసీఐ(BCCI) ఆఫీషియల్ షెడ్యూల్ ప్రకారం, వీరు ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో రెండు మ్యాచ్‌లు ఆడినట్లు ఉంది. జనవరి 11 నుండి న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం వీరు జాతీయ జట్టుతో కలిసే అవకాశముంది.

తాజాగా, విరాట్ కోహ్లీ మరో మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 6న ఢిల్లీ-రైల్వేస్ (Delhi-Railways) మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం, అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ట్రోఫీలో కోహ్లీ మొదటి మ్యాచ్‌లో సెంచరీ (131), రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (77) సాధించాడు. మరోవైపు, రోహిత్ శర్మ మరో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. తొలి మ్యాచ్‌లో సెంచరీ (155) చేసిన హిట్‌మ్యాన్ రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment