ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’..

ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’..

Summarize with AI

రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) ఓటీటీలోకి రానుంది. మహేష్ బాబు (Mahesh Babu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. ‘బయోపిక్ ఆఫ్ ఫ్యాన్’ అనే కాన్సెప్ట్‌తో ప్రమోట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ, డిసెంబర్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

కథ విషయానికి వస్తే… ‘ఆంధ్ర కింగ్’ అనే బిరుదుతో పేరొందిన సూపర్ స్టార్ సూర్య (ఉపేంద్ర) 100వ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోతుంది. ఆ సినిమాను ఎలాగైనా మొదలుపెట్టాలని సూర్య చేసిన ప్రయత్నాలు ఫలించవు. ఈ క్రమంలో ఒక అభిమాని సాగర్ (రామ్ పోతినేని) తన అకౌంట్లో మూడు కోట్లు జమ చేశాడని తెలుసుకుని, అతను ఎవరో తెలుసుకునేందుకు సూర్య బయలుదేరతాడు. అసలు సాగర్ ఎవరు? అతనికి అంత డబ్బు ఎలా వచ్చింది? సాగర్, అతని ప్రేయసి మహాలక్ష్మి (భాగ్యశ్రీ) ప్రేమకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? చివరికి సూర్య తన అభిమానిని కలిశాడా లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment