పీపీపీ విధానం ప్రజలపై భారమే: – సీపీఐ రామకృష్ణ

పీపీపీ విధానం ప్రజలపై భారమే: - సీపీఐ రామకృష్ణ

మెడికల్ కాలేజీలను (Medical Colleges) పీపీపీ (PPP) విధానంలో నడిపించాలన్న చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వ నిర్ణయంపై సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ (K. Ramakrishna) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) తాను జైలుకి వెళ్లడానికి సిద్ధమని వ్యాఖ్యానించడం చూస్తుంటే, కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం తప్పేనన్న భావన ఆయనకే ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

భూములు, భవనాల నిర్మాణం, మౌలిక వసతులు, సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తూ, లాభాలు మాత్రం ప్రైవేటు శక్తులకు దక్కేలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని రామకృష్ణ ఆరోపించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే, ఆదాయం మాత్రం ప్రైవేటు సంస్థలదే కావడం అత్యంత అన్యాయమని ఆయన అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఈ విధానానికి తెరలేపడం దుర్మార్గమైన నిర్ణయమని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, నిన్న పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలను దేశ చరిత్రలోనే ‘చీకటి రోజు’గా సీపీఐ రామకృష్ణ అభివర్ణించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ (Mahatma Gandhi) పేరును తొలగించడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీకి అపారమైన కీర్తి, ప్రతిష్ఠలు ఉన్నాయని, అలాంటి మహానుభావుడి పేరును తొలగించడం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఉపాధి హామీ పథకానికి (Employment Guarantee Scheme) పేరు మార్పు, సవరణలు తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కె. రామకృష్ణ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment