హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణ అంశం తెలంగాణలో (Telangana) చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) సొంత మామ (Uncle) పద్మారెడ్డి (Padma Reddy) హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ (Health Insurance Company) నివా బూపా (Niva Bupa)పై ఫిర్యాదు చేశారు. చికిత్సకు అయిన భారీ ఖర్చును ఇన్సూరెన్స్ సంస్థ తిరస్కరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
పద్మారెడ్డి 2024 మే 13న గుండెనొప్పితో హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్సకు మొత్తం రూ.23.50 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఈ మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా పొందేందుకు ప్రయత్నించగా, నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను(Claim) తిరస్కరించిందని (Rejected) ఆయన తెలిపారు.
గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ రూ.20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేసుకున్నా, పాలసీ తీసుకునే సమయంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అభ్యంతరం చెప్పని ఇన్సూరెన్స్ కంపెనీ, ఇప్పుడు క్లెయిమ్ సమయంలో మాత్రం కారణాలు చూపుతూ తిరస్కరించడం అన్యాయమని ఆరోపించారు.
తనకు మూడేళ్ల వయసు నుంచే పోస్ట్ పోలియో పెరాలసిస్ ఉందని, ఈ విషయం పాలసీ తీసుకునే సమయంలోనే తెలిసినప్పటికీ, అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పద్మారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు అదే కారణాన్ని చూపుతూ క్లెయిమ్ తిరస్కరించడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. సీఎం మామ ఫిర్యాదుతో హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల క్లెయిమ్ విధానాలపై మరోసారి చర్చ మొదలైంది.









సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’